Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భయం గుప్పిట్లో రైతులు..!

భయం గుప్పిట్లో రైతులు..!

- Advertisement -

– వరిగిన కరెంటు స్థంబాలు
– ప్రమాదాకి సూచికలు..
– ఏఎంఆర్పీ కాలువ పక్కన
– కొత్త గూడెం వ్యవసాయ భూముల్లో
– పట్టించుకోని ట్రాన్స్ కో అధికారులు
నవతెలంగాణ -పెద్దవూర
అసలే వర్షాకాలం ఈదురు గాలలకు ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఎప్పుడు ఏ విద్యుత్‌ స్తంభం పడి ప్రమాదం జరుగుతుందోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర మండలం ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటరీ కాలువ పక్కన కొత్త గూడెం వెళ్లే మట్టిరోడ్డు పక్కన వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన కరెంటు స్తంభాలు ఒకటి కాదు, రెండుకాడు ఏకంగా 05 విద్యుత్ స్థంబాలు ఒరిగిపోయి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అధికారులు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వ్యవసాయ పనుల్లో కూలీలు పనులు చేస్తుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో నని అక్కడి రైతులు బయాందోళన చెందు తున్నారు.ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.వర్షాకాలం కావటంతో సమస్య మరింత ప్రమాద కరంగా ఉంది.

మండల పరిధిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారి సమీపంలోని తుంగతుర్తి స్టేజి నుంచి కొత్త గూడెం వెళ్లే మట్టిరోడ్డు ఏఎంఆర్ పీ డిస్ట్రిబ్యూటరీ కాలువ పక్కన రైతులపంట చేలలో విద్యుత్‌ స్తంభాలు పూర్తిగా ఒరిగి పోయి పడిపోవటా నికి సిద్ధంగా ఉన్నా యి. విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోవటంతో తీగలు చేతికి అందే లా వేలాడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.మండలంలోని ఆయా గ్రామాలు వ్యవసాయ ఆధారితం కావటంతో తరుచుగా ట్రాక్టర్లతో గడ్డిని ఈర హదారుల గుండా రవాణా చేస్తుంటారు. దీంతో వి ద్యుత్‌ వైర్లు గడ్డి ట్రాక్టర్‌లకు తగిలి ప్రమాదాలు చోటుచేసుకుంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతం లో నాయినవాని కుంట సమీపంలో ప్రమాదం జరిగింది.అదృష్టవ శాత్తు ప్రాణనష్టం జరగకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సంఘటనలు మండలంలో అనేకం చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఒరిగిన కరెంటు స్థంబాలను సరి వేయాలి: కత్తి వెంకట్ రెడ్డి, రైతు ముసలమ్మ చెట్టు
మాకు అక్కడ మూడేకరాలలో పత్తి సాగు చేశాను. మా పంట పొలం లో రెండు కరెంటు స్థంబాలు వరిగి పోయాయి. కరెంటు తీగలు కిందికి వేలాడు తున్నాయి. నిత్యం వ్యవసాయ పనులు చెడకుంటూ ఉంటాము. వర్షాకాలం ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో నని భయందోళన చెందుతున్నాము. ట్రాన్స్ కో అధికారులు విద్యత్ స్టంభాలు బాగుచేయాలి. లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం వుంది.
చేనుకు వద్దామంటే భయం వేస్తుంది: కత్తి రాంకోటిరెడ్డి

చేను వద్దకు రావాలంటే కరెంటు స్థంబాల నే సూసుకుంటూ రావలసి వస్తుంది.ఎప్పుడు ఏ స్థంభం కింద పడిపోతుందో నని భయం,భయం గా వెళుతున్నాము.కూలీలు కూలీ కి రావాలంటే ఆమ్మో మీచేనుకు రాము అని చెపుతున్నారు.ఒకటి కాదు,వరుసగా 04 స్థంబాలు వరిగి పోయాయి.
ట్రాన్స్ కో అధికారులు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad