- Advertisement -
నవతెలంగాణ-అచ్చంపేట : డివిజన్ మిషన్ భగీరథ డిఈ , ఏఈఈ, ఏఈ లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమీక్ష నిర్వహించారు. అమ్రాబాద్ మండలంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు మార్చాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు అందించాలన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ఏక్కడ కూడా నీరు కలుషితం కాకుండా చూడాలని, పెండింగ్ పనులను ఇప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -