Sunday, August 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌ను తాకిన ఢిల్లీ సెగ..

హైదరాబాద్‌ను తాకిన ఢిల్లీ సెగ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా, నీట్ అవకతవకలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‍‍ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఏఐఎఫ్డిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీలు మంగళవారం సంయుక్తంగా ఛలో లోక్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి లోక్ భవన్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థులను రోడ్డుపై ఈడ్చిపారేసి, పలువురు నేతలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -