- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ‘పచ్చిది నీ పేగు సమ్మక్క’ అనే పాటను పాడారు. ఈ పాట తల్లి ఆకలి, కొడుకు కోసం పడే వేదనను వివరిస్తూ, సినిమాలో బలమైన మదర్ సెంటిమెంట్, డ్రామా దాగున్నాయని స్పష్టం చేసింది. ఇక ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ పాటతో ప్యారడైజ్ సినిమాపై అంచానాలు ఇంకా భారీగ పెరిగిపోయాయి.
- Advertisement -



