Wednesday, July 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాగోల్‌ మెట్రో రైల్‌‌ స్టేషన్‌‌ ను సందర్శించిన

నాగోల్‌ మెట్రో రైల్‌‌ స్టేషన్‌‌ ను సందర్శించిన

- Advertisement -


సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం శ్రీవాస్తవ
పనితీరు, కార్యాచరణ పద్దతులపై అధ్యయనం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నాగోల్‌‌లోని హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ ‌యూనిట్‌‌ను మంగళవారం సందర్శించారు. వివిధ శాఖల ప్రధాన అధికారులు, ఇతర సీనియర్ రైల్వే అధికారులతో కలిసి వెళ్లారు. జనరల్ మేనేజర్ తన పర్యటనను నాగోలులోని ఎల్ అండ్‌ ‌టీ మెట్రో రైల్ పరిపాలనా భవనంలో, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ , ఎల్‌ అండ్‌ ‌టీ మెట్రో రైల్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ సింగ్, ఎల్ అండ్‌ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.వి.బి రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చిప్లుంకర్ పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ , ఎల్ అండ్‌ ‌టీ మెట్రో రైల్ అధికారులు, మెట్రో రైల్ వ్యవస్థ పనితీరు, దాని కార్యాచరణ విధానం, నిర్వహణ పద్ధతులు, ప్రయాణీకుల సంఖ్య, కొనసాగుతున్న కార్యక్రమాలు భవిష్యత్ విస్తరణ ప్రణాళికలతో సహా వివరించారు. రాబోయే మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయడానికి రైల్వేల నుంచి నిరంతర మద్దతును మెట్రో రైల్ అధికారులు కోరారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ డిపోలోని ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌ను సైతం జీఎం సందర్శించారు. అక్కడ ఆయనకు మెట్రో రైలు కార్యకలాపాలు, రైలు పర్యవేక్షణ వ్యవస్థలు, భద్రతా నియమావళి, విపత్తు నిర్వహణ యంత్రాంగాలకు సంబంధించిన వివిధ అంశాలపై వివరించారు. నిర్వహణ షెడ్‌‌ను సైతం జీఎం పరిశీలించారు. అక్కడ రైల్వే అధికారులు మెట్రో కోచ్‌ల తనిఖీ, నిర్వహణలో పాలుపంచుకునే వివిధ విభాగాలను పరిశీలించడంతో పాటు, నిర్వహణ కార్యకలాపాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడాన్ని కూడా చూశారు. రైల్వే అధికారుల బృందం పిట్ లైన్‌ను కూడా సందర్శించి, కోచ్ నిర్వహణ సౌకర్యాలను పరిశీలించింది. మెయింటెనెన్స్ డిపోలోకి మెట్రో రైళ్లు ప్రవేశించే అప్రోచ్ ట్రాక్‌ల కోసం ఉన్న పాయింట్లు, క్రాసిం గ్‌‌లను సైతం తనిఖీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ ప్రమాణాలను ప్రశంసించారు. అలాగే, అధునాతన సాంకేతికతలు, శ్రేష్ఠమైన నిర్వహణ పద్ధతులను అవలం బించడం ద్వారా సమర్థవంతమైన రైలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నందుకుగాను హెచ్‌ఎం‌ఆర్‌ఎల్ ,ఎల్‌ అండ్‌ ‌టీ మెట్రో రైల్ అధికారులను అభినందించారు. కాగా దక్షిణ మధ్య రైల్వే, మెట్రో రైలు సంస్థల మధ్య కొనసాగు తున్న పరస్పర సహకారం భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -