Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్250 దేవిమాత మండపాలకు పట్టుచీరాల పంపిణీ: ఎమ్మెల్యే

250 దేవిమాత మండపాలకు పట్టుచీరాల పంపిణీ: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు, ట్రస్ట్ చైర్మన్ ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ధన్ పాల్ లక్ష్మీబాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ డిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు, ట్రస్ట్ చైర్మన్ ధన్ పాల్ సూర్యనారాయణ, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, ధన్ పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త ట్రస్ట్ సభ్యులు పాల్గొని పట్టుచీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేవి నవరాత్రుల సందర్బంగా ఇందూర్ నగరంలో గత 11 ఏళ్ల నుండి తమ ట్రస్ట్ ద్వారా పట్టుచీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తునామని, ఈ సంవత్సరం దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేశామని తెలిపారు. హిందూ పండుగలకు తమ వంతు సహకారం, హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి దసరా పండుగను జరుపుకుంటారని అన్నారు.

హిందూ బంధువులు ఆడపడుచులు అంత ఐక్యతతో,భక్తి శ్రద్దలతో నిర్వహించే దేవి నవరాత్రులకు తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హిందూ ధర్మరక్షణకు, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి ప్రతి కార్యానికి తమ ట్రస్ట్ ద్వారా సేవాలాందించడానికి ముందుంటమన్నారు, అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతన్నలు సకాలంలో వర్షాలు కురిసి అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలన్నారు. దుర్గా దేవి నవ రాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధన్ పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -