- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి ఏకే47తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని అజూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా జరుగుతోందని అధికారులు వివరించారు.
- Advertisement -