- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌ల నుండి తమ రాయబారులను ఇరాన్ శనివారం వెనక్కి పిలిపించింది. సంప్రదింపుల కోసం రాయబారులను వెనక్కి పిలిపిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. తన అణుకార్యక్రమాన్ని తిరిగి అమలు చేయడంపై ఐరాస ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో సహకరించకపోవడం, అమెరికాతో ప్రత్యక్షంగా చర్చలు జరపకపోవడంపై ఈ మూడు దేశాలు ఇరాన్‌పై మూకుమ్మడిగా తిరిగి ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి.
- Advertisement -