- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు.
- Advertisement -