- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.
- Advertisement -