Saturday, October 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉత్తరప్రదేశ్‌లో భారీ పేలుడు..ఇద్దరు మృతి

ఉత్తరప్రదేశ్‌లో భారీ పేలుడు..ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా సాతాన్‌పూర్ మండీ రోడ్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భవనం పైకప్పు సహా పలు భాగాలు ధ్వంసమయ్యాయి. సమీప ఇళ్ల కిటికీలు పగిలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటనాస్థలానికి పోలీసులు, బాంబు స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ బృందాలు చేరుకుని దర్యాప్తు చేపట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -