రూ.2 లక్షల నగదు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
నవతెలంగాణ-చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల మండల తహసీల్దార్ గుగులోతు కృష్ణ గురువారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ నల్లగొండ రేంజ్ ఆఫీసర్ సీహెచ్. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 172లో ముటేషన్ చేయడానికి, సర్వే నెంబర్ 167 ఇన్‌స్పెక్షన్ చేయడానికి తహసీల్దార్ గుగులోతు కృష్ణ రూ.10 లక్షలు డిమాండ్ చేయగా రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రూ.2లక్షలు కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా తీసుకుంటుండ గా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలోనూ ఈయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీ వలకు చిక్కిన చిట్యాల తహసీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES