Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాలక్ష్మి పథకంతో మహిళల్లో పురోగతి 

మహాలక్ష్మి పథకంతో మహిళల్లో పురోగతి 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం మహిళల పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని పలువురు మహిళలు మహిళ సంఘాలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో నూటికి నూరు శాతం ఫలితాన్ని ఇస్తున్న పథకం మహాలక్ష్మి పథకం మాత్రమేనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు ఆర్థికంగా ఆరోగ్యంగా భక్తి పరంగా బంధుత్వం పరంగా ఇలా అనేక రకాలుగా మహాలక్ష్మి పథకంతో అభివృద్ధి చెందుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు మహిళలు ఆరోగ్యం విషయంలో స్థానికంగా ఉండే నాటు వైద్యులు ఆర్ఎంపి పి.ఎం.పి డాక్టర్ల వైద్యంతో సర్దుకుపోయేవాళ్లు. బస్సు చార్జి డబ్బులతో ఆర్ఎంపీ డాక్టర్ ఫీజు మందులకు సరిపోతాయని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కానీ ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వలన జిల్లా కేంద్రంలోని ప్రత్యేక వైద్య నిపుణుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

అంతేకాక రాష్ట్ర రాజధాని సైతం వెళ్లి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇది ప్రధానంగా మహిళలకు కలిసి వస్తున్న అంశం. ఒకప్పుడు జిల్లా కేంద్రాల్లోని ప్రధాని ఆసుపత్రుల్లో ఓపి 10 గంటల లోపే ముగిసేది ఇప్పుడు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం మొదలైన వాటి నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓపి చూడాల్సిన పరిస్థితి వస్తుందని వీరిలో అధికంగా మహిళలు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు అంటే సమీప గ్రామాల నుండి అత్యధికంగా మహిళలు తమ ఆరోగ్యం కోసం పట్టణ కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గతంలో బస్సు చార్జీల భారంతో పెళ్లిళ్లకు పలు శుభకార్యాలకు దిన కార్యాలకు కేవలం ఆ కుటుంబానికి చెందిన మగ వ్యక్తులు మాత్రమే వెళ్లేవారు. వారి చార్జీలు మందు ఖర్చులు తడిసి మోపెడు అయ్యేయి కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది ఇప్పుడు ప్రతి కుటుంబం నుండి మహిళలు మాత్రమే వివాహాది శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు దీనివల్ల ఆర్థికంగా భారం తగ్గిందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.

అదేవిధంగా వృద్ధులైన మహిళలు తమ కూతుర్ల ఇంటికి ఎప్పుడంటే అప్పుడు చూడాలనిపించిన ప్రతిసారి వెళ్లి వస్తున్నామని తెలుపుతున్నారు. గ్రూపు సభ్యులుగా ప్రతి చారిత్రక ప్రదేశాలను చూసి వస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పుణ్యమా అని తాము గతంలో ఎన్నడూ చూడని తీర్థయాత్రలను ప్రదేశాలను చూస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార పరంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని చిరు వ్యాపారులు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వరంగల్ హైదరాబాద్ నగరాలకు కూడా వెళ్లి తాము అవసరమైన మెటీరియల్ను తెచ్చుకోగలుగుతున్నామని అంటున్నారు. రవాణా చార్జీల భారం లేకపోవడం వల్ల అనేక పర్యాయములు తిరిగి అవసరమైన సరుకులను తెచ్చుకుంటున్నామని గృహిణులు కూడా తెలుపుతున్నారు.

బట్టలు కిరాణం  గృహపకరణాలు ఒక్కటేంటి అనేక రకాలుగా అవసరాన్ని బట్టి వెళ్లి రాగలుగుతున్నాం అంటే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్లనే సాధ్యమని మహిళలు తెలుపుతున్నారు. మండలం నుండి సుమారు 1000 మంది మహిళలు రోజుకు వివిధ బస్సులలో వివిధ ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారని పలువురు తెలుపుతున్నారు. ఒకప్పుడు వంద మంది కూడా ప్రయాణం చేయలేని దుస్థితి నుండి ఈనాడు వెయ్యి మది ప్రయాణం చేస్తున్నారు అంటే అది మహాలక్ష్మి పథకం చలువే అని మహిళలు అంటున్నారు. పథకం ప్రారంభంలో చిదురు ముదురు సంఘటనలు మినహా ప్రస్తుతం పథకం వినియోగంపై మహిళలకు కూడా అవగాహన పెరిగిందని ఇప్పుడు సర్దుకుపోతున్నామని మహిళలు పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకే పరిమితం చేయకుండా పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను పెంచడంతోపాటు ఇతర బస్సులకువర్తింపచేయాలని మహిళలు మహిళా సంఘాల నాయకులు కోరుతున్నారు.

మహాలక్ష్మి పథకం పేద మహిళలకు ఎంతో ఉపయోగం : యాస పూలమ్మ  తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఎంతో మంది పేద మహిళలకు మేలు జరుగుతుంది. నీ పతకాన్ని ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగించాలి. మహిళల అవసరాలకు జనాభాకు తగిన విధంగా బస్సులను పెంచాలి. అన్ని తరగతుల మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ పథకం మహిళలలో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చింది. మహిళల్లోకానికి తెలియని ఎన్నో రకాల విషయాలను తెలుసుకునేందుకు దోహదపడుతుంది. ఆరోగ్యం కొరకు మరియు వ్యాపారాధికాభవృద్ధికి ఉద్యోగం చేస్తున్న వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో సంపూర్ణంగా అమలవుతున్న పథకాన్ని మహాలక్ష్మి పథకంగా పేర్కొనవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -