నవతెలంగాణ – మద్నూర్
ఈ రోజుల్లో మనుషులు డాక్టర్ల వైద్యంతో చచ్చిపోయిన అడిగే వారే లేరు. అలాంటిది మూగ జీవులైన పశువులకు ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చిన ఏముంది అనేదానికి మద్నూర్ పశు వైద్య ఆస్పత్రి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఆస్పత్రిలో వైద్యులు లేరు, ఇన్చార్జి వైద్యులు రారు.. మూగ జీవులు అనారోగ్యానికి గురి అయితే పశువుల దారులు పశు వైద్యశాలకు తీసుకువస్తే ..ఇక్కడ వైద్యం చేసేది అటెండరే. బుధవారం నవ తెలంగాణ మద్నూర్ పశు వైద్యశాలను సందర్శించగా.. పశువులకు సలీం అనే అటెండరే పశువులకు చికిత్సలు అందించే దృశ్యం నవతెలంగాణ కెమెరా కంటపడింది. చిన్నారి లేక దూడలకు అటెండరే వైద్యం అందించడం.. లేగ దూడలకు ఎంత మోతాదున ఇంజక్షన్లు ఇవ్వాలి అనేది తెలిసినా.. తెలియకపోయినా… ఆస్పత్రిలో నేను ఉన్నాను కదా అంటూనే లేక దూడలకు చికిత్సలు అందించడం అటెండరే వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నాడు.
దీంతో డాక్టర్ ను నవతెలంగాణ ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఈరోజు నేను రాలేక పోతున్నానని, నాకు సమావేశానికి వెళ్లవలసి రావడం వలన మద్నూర్ ఆస్పత్రికి రాలేక పోయానని, నేను అసలైన డ్యూటీ నిజాంసాగర్ మండలం గాలిపూర్లో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. మూగజీవాలకు అటెండరే చికిత్సలు ఎలా చేస్తారని ప్రశ్నించగా .. వైద్యులు లేని సమయంలో ఫస్ట్ ఎయిడ్ చికిత్సలు చేయడం సహజమే అని తెలిపారు. చిన్నారి లేగ దూడలకు ఇంజక్షన్లు ఇస్తున్నారు కదా అని ప్రశ్నించగా.. అలాంటి చికిత్సలు చేయడం అటెండర్ పని కాదని, ఏదో ఆస్పత్రికి వచ్చిన పశువులకు ఫస్ట్ ఎడ్ చికిత్సలు చెయ్యవచ్చు అంటూ తెలపడం.. వైద్యుల పనితీరు ఇచ్చే సమాధానాలపై మూగజీవులు చచ్చినా బతికినా ..చికిత్సలు సరైన రీతిలో అందినా.. అందకపోయినా అడిగే వారే లేరని పశువుల దారులు వాపోతున్నారు.
అటెండర్ అందించే చికిత్సల వలన పశువులు చనిపోతే భాధ్యులు ఎవరని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో ఎప్పుడుఊ వైద్యులు ఉండే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని, మూగ జీవాల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మూగజీవాలకు అటెండరే వైద్యుడు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES