Friday, June 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభిన్న కథతోనయా సినిమా

భిన్న కథతోనయా సినిమా

- Advertisement -

‘మ్యాడ్’, ‘ఆయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి వరుస విజయాల తర్వాత హీరో నార్నే నితిన్ మరో భిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తాజాగా ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధా కృష్ణతో సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం జతకట్టారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భం గా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ వినూత్నంగా ఆకట్టుకుం టోంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు తరహాలో డిజైన్ చేసిన ఈ పోస్టర్ యూత్‌ఫుల్ రొమాంటిక్ వైబ్‌ను అందిస్తోంది. నీలాకాశం నేపథ్యంగా ఓ భవనం అంచున టీ-షర్ట్, జీన్స్, స్నీకర్స్‌లో కూల్‌గా కూర్చున్న నార్నే నితిన్ కనిపిస్తుండగా, ఎరుపు రంగు డ్రెస్‌లో ఉన్న ఓ యువతి పోస్టులోని హార్ట్ ఐకాన్‌ను ట్యాప్ చేయ బోతున్నట్లు చూపించారు. “ఆకాశంలో ఉంటుంది మూన్… నువ్వే నా లైఫ్‌కి క్వీన్…” అనే ఫన్నీ లైన్‌తో పాటు వేలాది లైక్స్, కామెంట్స్, ట్రెండీ హ్యాష్‌ట్యాగ్స్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా నార్నే నితిన్ బావ, హీరో ఎన్టీఆర్ ఈ పోస్టును లైక్ చేసినట్లు చూపించడం అభిమానులను మరింత ఆకట్టుకుం టోంది. పోస్టర్ ద్వారా చిత్రంలోని రొమాన్స్, వినోదం మాత్రమే కాకుండా మేకర్స్ క్రియేటివిటీ కూడా స్పష్టమవుతోంది.మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ సినిమాకి నిర్మాత: వెంకట్ కె నారాయణ, దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి, డీవోపీ: రామ మారుతి ఎం., ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ఆర్ట్ డైరెక్టర్: శివ కామేష్ డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్య పోట్ల, అజయ్ గద్దె.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -