Wednesday, August 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్ర

మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్ర

- Advertisement -

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని ఈనెల 21న రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా నటి వేధా జలం ధర్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. మహిళ లకు స్పూర్తినిచ్చేలా నా పాత్ర ఉండటం సంతోషంగా ఉంది. మా అమ్మే నాకు స్పూర్తి. ఈ సినిమా లోని పాత్ర కూడా అలానే ఉంటుం ది. ముక్కు సూటిగా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. ఈ సినిమా చూసిన వారంతా నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు. నేను చేసింది ఒకటి, రెండు సినిమాలే అయినా అందరూ నన్ను గుర్తు పడుతున్నారు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో బిర్యానీది మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కథలో ఆ ఎలిమెంట్ బాగా కుదిరింది. మా చిత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతీ పాత్ర అందరికీ బాగా కనెక్ట్‌ అవుతుంది.మా సినిమాని స్పిరిట్ టీం చూసి అభినందించింది. మా ప్రీమియర్ చూసిన వీఎన్ ఆదిత్య కూడా చాలా మెచ్చుకున్నారు. రైటింగ్‌, మేకింగ్‌ బాగుందని ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -