ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుయోధన’. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకుడు. బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు.
పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నేడు (శుక్రవారం) విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ,’మా సినిమాకు మా టెక్నీషియన్స్ ప్రధాన బలంగా నిలిచారు. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్, కార్తీక్ కెమెరా వర్క్, జై క్రిష్ సంగీతం, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్..ఇవన్నీ ఎంతో క్వాలిటీగా సినిమా వచ్చేలా చేశాయి. మా డైరెక్టర్ మాధవ్‌కు ఫస్ట్ సినిమా అయినా అనుభవజ్ఞుడిలా అందరి నుంచి తనకు కావాల్సిన అవుట్ పుట్ తీసుకున్నారు.
ప్రియదర్శి, సాయికుమార్ మాకు ఇచ్చిన సహకారం గురించి మర్చిపోలేను. మా చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు బాపిరాజు. ఆయన లాంటి వాళ్లు అందరు నిర్మాతలకు దొరికితే ఎవరికీ సమస్య ఉండదు’ అని అన్నారు. ‘ప్రియదర్శి ‘బలగం, కోర్ట్’ సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయో, అంతకంటే ఎక్కువ ఈ సినిమా వసూళ్లు తీసుకొస్తుందని నమ్ముతున్నాం’ అని డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు చెప్పారు.
డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ,’సౌండ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది’ అని తెలిపారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ,’ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ కథ, టైటిల్ విన్నప్పుడే ఇది కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది’ అని అన్నారు.
మీ ఊహకి అందని కథ
- Advertisement -
- Advertisement -



