‘వీరభద్రుడు’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు హీరో సూర్య సిద్ధమవుతున్నారు. ఇందులో త్రిష హీరోయిన్. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో తెరకెక్కించింది. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రిలీజ్ అవుతుంది. ఈనెల 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సుప్రియా యార్లగడ్డ పాల్గొన్నారు.హీరో సూర్య మాట్లాడుతూ,’తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా అదృష్ట వంతుడిగా భావిస్తాను. నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు… కానీ తెలుగు వారి మనసు మాత్రం నాకు బాగా తెలుసు. సుప్రియతో మాకు ఎప్పటినుంచో చాలా మంచి స్నేహం ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఇంత అద్భుతమైన ప్రమోషన్స్, రిలీజ్ ప్లానింగ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాతో ప్రేక్షకులు ఖచ్చితంగా చాలా సంతృప్తి పొందుతారు. రాకేందు మౌళి చాలా చక్కని మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి, శ్యామ్ చాలా మంచి పాటలు రాశారు. వాటికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఆర్.జే. బాలాజీ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి థియేటర్లలో మాస్ మసాలా
ఈ సినిమా ఫస్ట్ లుక్ నాకు చాలా నచ్చింది. ఇది మాస్ మసాలా అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కూడా చెప్పొచ్చు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ‘గజని` డేస్ గుర్తుకు వచ్చాయి. ఇలాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది.హీరో కార్తీ మూమెంట్స్‌తో ఉంటుంది. చాలా మంచి హ్యూమర్, ఫన్ ఉంటాయి… ఇది నా ప్రామీస్అని అన్నారు. డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ మాట్లాడుతూ,'సూర్య సినిమాలను తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ సినిమాను కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అద్భుతంగా తీర్చిదిద్దాం. దర్శకుడిగా నేను సూర్యతో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమాలో ఏముంటుందో ట్రైలర్‌లో కొంత మాత్రమే చూపించాం. సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ మాస్ మసాలా ఫిల్మ్. అభిమానులు చూడాలనుకునే సూర్యను ఈ సినిమాలో చూపించాం. ఇది ఒక ఇంటెలిజెంట్ కమర్షియల్ ఫిల్మ్ అని తెలిపారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ‘ఇది చాలా అద్భుతమైన ఎమోషన్స్‌తో కూడిన సినిమా. పాటలన్నీ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి. సాయి అభ్యంకర్ చాలా అద్భుతమైన సంగీతం అందించారు` అని చెప్పారు.
థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే పక్కా మాస్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -



