నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన తండాల మంజుల (38) శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గత కొన్నేళ్ల క్రితం భర్త సమ్మయ్యతో కలిసి అక్కడికి జీవనోపాధి కోసం వెళ్లి, కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ సంఘటనతో గ్రామంలో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల నాయకులు రంగు మురళి, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, స్థానికులు ముక్తార్ పాషా మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES