Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

- Advertisement -

– ప్రపంచ విద్యార్థి దినోత్సవం 
నవతెలంగాణ – బల్మూరు

మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణుమూర్తి కలాం చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగానివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి గురించి మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా మరియు శాస్త్రవేత్తగా దేశానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వీరి జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎన్ ఎం ఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష వ్రాయబోతున్న 15 మంది విద్యార్థులకు క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో , ఆవోప -హైదరాబాద్ వారి సహకారంతో స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ జిల్లా కార్యదర్శి శ్రీ బంధం పరమేశ్వర ప్రసాద్, అచ్చంపేట డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీ రామోజీ, పాఠశాల ఉపాధ్యాయులు అరుణ, భారతి, లీలాబాయి, చంద్రకళ, రమాదేవి, బిక్కు, సుందరయ్య, నిర్మల, రాజేశ్వరి నిరంజన్, వెంకటస్వామి, వీరబ్రహ్మం, వెంకటరమణ, భాగ్యమ్మ, రాజీవ్ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -