న్యూఢిల్లీ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాకు గాయాల బెడద మొదలైంది. జ్వరంతో జశ్‌ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌కు దూరం కాగా.. కడుపులో నొప్పితో అభిషేక్ శర్మ న్యూఢిల్లీలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న అభిషేక్ శర్మకు ఉపశమనం లభించలేదని సమాచారం. అస్వస్థతకు కారణం తేలాల్సి ఉండగా, అభిషేక్ శర్మ కోలుకునేందుకు కాస్త సమయం పట్టవచ్చు. దీంతో నేడు నమీబియాతో గ్రూప్ దశ మ్యాచ్‌కు ధనాధన్ ఓపెనర్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ.
మరో ఓపెనర్ సంజు శాంసన్‌తో ఇషాన్ కిషన్ జతకట్టనున్నాడు. గాయం నుంచి కోలుకున్న స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూఢిల్లీలో జట్టుతో చేరాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తుది జట్టులో ఆడుతుండటంతో వాషింగ్టన్ సుందర్ బ్యాకప్‌గా బెంచ్‌కు పరిమితం కానున్నాడు. జ్వరం నుంచి కోలుకున్న జశ్‌ప్రీత్ బుమ్రా నేడు నమీబియాతో మ్యాచ్‌లో ఆడనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు. గాయంతో పేసర్ హర్షిత్ రానా ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
అభిషేక్‌కు అస్వస్థత
- Advertisement -
- Advertisement -



