రూ.లక్షా 90 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ ఈఈగా, దేవాదాయ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈగా పనిచేస్తున్న ఊడెపు రామారావును బుధవారం రాత్రి ఉప్పల్‌లో ఒక మెడికల్ షాపులో కాంట్రాక్టర్ నుంచి రూ.1,90,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కొన్నేండ్లుగా రామారావుపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. రామారావు ఇటీవల చేసిన సంతకాలు, ఎవరెవరికి మేలు చేసే చర్యలు తీసుకున్నారు.. తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. రామారావుకి సంబంధించిన పలు ఆస్తులతో పాటు వారి బంధువుల ఇండ్లల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏసీబీకి చిక్కిన రామారావు ఇప్పటికే పలుమార్లు అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయి ఇటీవలే మళ్లీ దేవస్థానం విద్యుత్ విభాగంలో విధుల్లో చేరాడు.
ఏసీబీకి చిక్కిన యాద్రాద్రి దేవస్థానం ఎలక్ట్రికల్ ఈఈ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



