సామాజిక కార్యకర్త తుమ్మల రామకృష్ణ
నవతెలంగాణ – గోవిందరావుపేట
పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సామాజిక కార్యకర్త తుమ్మల రామకృష్ణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ పాఠశాల నుండి ఉత్తమ ఫలితాలు 10/10, సాధించిన వారికి, రూ.5,000, నగదు బహుమతి అందజేస్తానని అన్నారు. అంతేకాక మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారికి ఒకరికి రూ.3 వేల చొప్పున నగదు కోసం పురస్కారాలు అందజేస్తానని అన్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గొంది దివాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రఘురాం , ఉపాధ్యాయులు, అన్నా మేరీ, రేణుక, సుగుణ, వెంకటలక్ష్మి, వనజ, అంజలి, రాజమౌళి, వినోద , ప్రియ మిత్రులు, యాదిరెడ్డి, కిషోర్ పాల్గొన్నారు.
పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



