నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది బి. మాణిక్ రాజు ను జిల్లా కార్మిక శాఖ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నియమిస్తు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా అదనపు కలెక్టర్, సభ్యులుగా పోలీస్ కమిషనర్, జిల్లా కార్మిక శాఖ అధికారి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి, జిల్లా గిరిజన శాఖ అధికారులతో పాటు కొందరు సామాజిక సేవ కార్యకర్తలు ఉన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తరపున న్యాయవాది మాణిక్ రాజు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించనున్నారు.భవన కార్మిక సంఘాలతో కలిసి పలు సంక్షేమ పథకాలు వారి దరికి చేరే విదంగా మాణిక్ రాజు కృషి చేశారు. కార్మికులకు కార్మిక చట్టాలు వాటి ప్రయోజనం గూర్చి న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయించారు. పదుల సంఖ్యలో కార్మికులకు తన స్వంత డబ్బుతో భీమా సౌకర్యం కల్పించారు. పలువురు న్యాయవాదులు రాజు కు అభినందనలు తెలియజేశారు.
కార్మిక శాఖ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యునిగా న్యాయవాది మాణిక్ రాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES