Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయంఅకీరా నందన్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌

అకీరా నందన్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌

- Advertisement -

– అయినా అనుమతి లేనిదే కంటెంట్‌ ప్రసారం చేయొద్దు
– ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
– ఏఐ చిత్రం, డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై నిషేధం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ అప్పుడే మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే.. అనుమతి లేకుండా అకీరా నందన్‌పై రూపొందించిన కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిత్వ హక్కుల రక్షణకు సంబంధించి అకీరా దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన పేరు, స్వరం, ముఖకవళికలు, వ్యక్తిత్వాన్ని ఉపయోగిస్తూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా రూపొందించిన కంటెంట్‌ ప్రసారంపై నిషేధం విధించింది. ముఖ్యంగా ”ఏఐ లవ్‌ స్టోరీ” అనే చిత్రంతో పాటు, అకీరా నందన్‌ గుర్తింపును వాడుతూ సోషల్‌ మీడియాలో ఉన్న ఇతర డీప్‌ఫేక్‌ కంటెంట్‌ ప్రచారాన్ని నిలిపివేసింది. తన వ్యక్తిగత గోప్యత, ప్రతిష్టకు భంగం కలుగుతోందని తాజాగా అకీరా నందన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన ప్రమేయం లేకుండానే ఏఐ మార్ఫింగ్‌, డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో పూర్తి నిడివి గల సినిమాను రూపొందించి తనను ప్రధాన పాత్రలో చూపించారని పిటిషన్‌లో ప్రస్తావించారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు 11 లక్షలకు పైగా, ఇంగ్లీష్‌ వెర్షన్‌కు 24 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయని నివేదించారు. ఈ పిటిషన్‌ ను మంగళవారం జస్టిస్‌ తుషార్‌ రావు గెదెలా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అకీరా తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అకీరా పేరుతో సోషల్‌ మీడియాలో అనేక ఫేక్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసి, వాటితో విరాళాలు సేకరిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని కోర్టు దష్టికి తీసుకెళ్లారు.

మధ్యలో ధర్మాసనం స్పందిస్తూ, అకీరా నందన్‌ అప్పుడే మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారని వ్యాఖ్యానించింది. అయితే ఏ వ్యక్తికైనా తమ పేరును, చిత్రాన్ని లేదా వ్యక్తిత్వాన్ని వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా ఇతరులు వాడుకోకుండా అడ్డుకునే ‘పబ్లిసిటీ రైట్‌’ ఉంటుందని పేర్కొంది. పిటిషనర్‌ వాదనలను పరిగణనలోకి తీసుకొని, అకీరాకు సంబంధించి సోషల్‌ ప్లాట్‌ ఫ్లాంలపై షేర్‌ చేసిన అన్నీ కంటెంట్‌ లను తొలగించాలని ఆదేశించింది. సదరు ఫేక్‌ కంటెంట్‌ను సష్టించిన వ్యక్తుల ఐపీ అడ్రస్‌లు, అకౌంట్‌ వివరాలను వెల్లడించాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -