Monday, March 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చదువుతోపాటు ఆటలు కూడ ముఖ్యమే..

చదువుతోపాటు ఆటలు కూడ ముఖ్యమే..

- Advertisement -

 గిరిజన హై స్కూల్ ను తనిఖీ చేసిన మానవ హక్కుల కమిషన్  చైర్పర్సన్.

 ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు, మంచి వైద్యం అందించాలి.

 నవతెలంగాణ జన్నారం

 విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమేనని, ప్రతిరోజు సాయంత్రం పూట ఆటలు ఆడుకోవాలని, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, షమీం అత్తర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ హైస్కూల్ ను, ప్రభుత్వాసుపత్రిని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి విద్య సామర్ధ్యాన్ని పరిశీలించారు. ఆ విద్యార్థుల స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నార… అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

 ప్రభుత్వ ఆశ్రమ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని  ప్రభుత్వాసుపత్రిని ఆయన తనిఖీ చేసి, ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తిస్తూ నాణ్యమైన చికిత్సను అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో  మందులు గోళీలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్ద పీట వేస్తుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, మంచిర్యాల డీడీఓ రమాదేవి,ఏటీడీఓ సురేష్, స్థానిక ఇన్చార్జి తాహసిల్దార్ నేరెళ్ల రామ్మోహన్,గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం లక్ష్మీరాజం, హెడ్మాస్టర్ రామస్వామి ఉపాధ్యాయులు కాంతారావు వార్డెన్ రాజేష్, ప్రభుత్వ వైద్యాధికారులు ఉమాశ్రీ, లక్ష్మి, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -