Thursday, June 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ ‌కుమారుడి సంస్థలో 
అంబానీ భారీ పెట్టుబడులు

ట్రంప్‌ ‌కుమారుడి సంస్థలో 
అంబానీ భారీ పెట్టుబడులు

- Advertisement -

ఇబ్బందుల్లో ఉన్న కంపెనీతో రిలయన్స్‌ ‌డీల్‌‌పై కొత్త ప్రశ్నలు
భారీ పెట్టుబడుల తర్వాతే భారత్‌‌పై 
కఠిన ఆంక్షలు సడలించిన అమెరికా అధ్యక్ష‍ుడు
రిలయన్స్‌‌కు కలిసొచ్చేలా నిర్ణయాలు
చర్చనీయాంశంగా మారిన ‘ప్రోపబ్లికా’ కథనం
భారత్‌-యూఎస్‌ సంబంధాల నీడలో కార్పొరేట్‌ ఒప్పందాలు
బడా పారిశ్రామికవేత్తల చుట్టూ తిరుగుతున్న 
దేశ విదేశాంగ, వాణిజ్య విధానాలు

భారత విదేశాంగ విధానం, వాణిజ్య ప్రయోజనాలు, దేశ ప్రతిష్ట కంటే కొద్దిమంది కార్పొరేట్ దిగ్గజాల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందా? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు రహస్యంగా సంబంధాలున్న కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడి పెట్టినట్టు ‘ప్రోపబ్లికా’ దర్యాప్తు వెల్లడించడం ఈ ప్రశ్నలను మరింత బలంగా ముందుకు తెచ్చింది. ఇక ఈ భారీ పెట్టుబడుల అనంతరం రిలయన్స్‌‌కు అనుకూలంగా భారత్‌‌పై అమెరికా విధానంలో సానుకూల మార్పు కూడా కనిపించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మోడీ ప్రభుత్వం తరచూ ‘దేశ ప్రయోజనం ప్రధానం’ అని చెప్తున్నప్పటికీ.. ప్రభుత్వ విధానాలు, అంబానీ వ్యాపార ప్రయోజనాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై అనేక సందేహాలు కలుగుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

న్యూఢిల్లీ, వాషింగ్టన్‌ : భారత్‌‌పై అమెరికా అధ్యక్ష‍ుడు డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌సుంకాల ఒత్తిడి కొనసాగుతున్న సమయంలో ‌భారత్‌‌లోని బడా పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌.. అమెరికాలోని ఒక వివాదాస్పద రిఫైనరీ ప్రాజెక్టులో వందల మిలియన్‌ ‌డాలర్లు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ సంస్థలో డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌జూనియర్‌ ‌రహస్య వాటాదారుడి గా ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ‘ప్రోపబ్లికా’ దర్యాప్తు వెల్లడించింది. పెట్టుబడుల అనంతరం రిలయన్స్‌కు అనుకూలంగా కనిపించిన అమెరికా విధాన మార్పులు, మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుబంధాలపై కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి. ట్రంప్‌ ‌కుటుంబ వ్యాపార ప్రయో జనాలు, అమెరికా ప్రభుత్వ విధానాలు, అంబానీల వ్యాపార లావాదేవీల మధ్య ఉన్న సంబంధాల పైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దేశ విదేశాంగ, వాణిజ్య విధానాలు బడా పారిశ్రామికవేత్తల కోసమేనన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష‍ుడు.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌‌పై సుంకాల ఒత్తిడి పెంచుతున్న సమయంలో.. ట్రంప్‌ ‌కుమారుడు డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌జూనియర్‌‌కు రహస్యంగా సంబంధాలు ఉన్న అమెరికన్‌ ‌రిఫైనరీ స్టార్టప్‌‌లో రిలయన్స్‌ ‌భారీ పెట్టుబడి పెట్టినట్టు దర్యాప్తు సంస్థ ప్రోపబ్లికా వెల్లడించింది.

సమస్యలతో సతమతమవుతున్న కంపెనీలో రిలయన్స్‌ ‌పెట్టుబడులు
ప్రోపబ్లికా కథనం ప్రకారం…అమెరికాలోని అమెరికా ఫస్ట్‌ ‌రిఫైనింగ్‌ అనే టెక్సాస్‌ ‌స్టార్టప్‌‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ‌భారీ పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ చాలా కాలంగా నిధుల కొరత, ప్రాజెక్టు ఆలస్యం, కోర్టు కేసులు, దివాలా సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. అయితే ఈ కంపెనీలో డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌జూనియర్‌ ‌రహస్యంగా వాటా కలిగి ఉన్నారు. ఇన్ని సమస్యలు కలిగి ఉన్న సంస్థలో రియలన్స్‌‌ భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహం అందరిలోనూ కలుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ట్రంప్‌ ‌గతేడాది భారత్‌‌పై విధించిన భారీ సుంకాల వెల్లడించింది.

సమస్యలతో సతమతమవుతున్న 
కంపెనీలో రిలయన్స్‌ ‌పెట్టుబడులు
ప్రోపబ్లికా కథనం ప్రకారం…అమెరికాలోని అమెరికా ఫస్ట్‌ ‌రిఫైనింగ్‌ అనే టెక్సాస్‌ ‌స్టార్టప్‌‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ‌భారీ పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ చాలా కాలంగా నిధుల కొరత, ప్రాజెక్టు ఆలస్యం, కోర్టు కేసులు, దివాలా సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. అయితే ఈ కంపెనీలో డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌జూనియర్‌ ‌రహస్యంగా వాటా కలిగి ఉన్నారు. ఇన్ని సమస్యలు కలిగి ఉన్న సంస్థలో రియలన్స్‌‌ భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహం అందరిలోనూ కలుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ట్రంప్‌ ‌గతేడాది భారత్‌‌పై విధించిన భారీ సుంకాల విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే అసలు విషయం అర్థమవుతుందని అంటున్నారు.

​సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్‌
గతేడాది ట్రంప్‌.. భారత్‌‌పై 50 శాతం వరకు సుంకాలు విధించారు. ముఖ్యంగా రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌ ‌వంటి సంస్థలపై ఒత్తిడి పెంచారు. ట్రంప్‌ ‌సలహాదారు పీటర్‌ ‌నవారో భారత ‘రాజకీయ సంబంధాలున్న ఇంధన దిగ్గజాలు’ రష్యాకు మద్దతు ఇస్తున్నాయని పరోక్ష‍ంగా రిలయన్స్‌‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శించారు.

​ట్రంప్‌ ‌జూనియర్‌ ‌భారత పర్యటన.. 
మారిన పరిస్థితులు
అయితే అలాంటి పరిస్థితుల్లోనే డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌జూనియర్‌ ‌భారత్‌‌లో పర్యటించాడు. ఈ పర్యటనలోనే ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీని డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌జూనియర్‌ కలిశాడు. ఇద్దరూ జామ్‌‌నగర్‌‌లో అంబానీకి చెందిన వన్‌‌తార జూను సందర్శించారు. గుజరాతీ జానపద నృత్యంలో కూడా పాల్గొన్నారు. కొద్ది నెలల తర్వాతే రిలయన్స్‌.. ట్రంప్‌ ‌జూనియర్‌‌కు సంబంధాలున్న కంపెనీలో ‌పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ పరిణామం అనంతరం గణనీయమైన మార్పులు సంభవించాయి. అమెరికా-భారత్‌ ‌వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ట్రంప్‌.. భారత్‌‌పై విధించిన కొన్ని కఠిన చర్యలను సడలించారు. భారత్‌‌కు వెనిజులా చమురు కొనుగోలుకు అనుమతి లభించింది. రష్యా చమురు కొనుగోలుపై కూడా మినహాయింపులు వచ్చాయి. దీంతో రిలయన్స్‌ ‌భారీ పెట్టుబడులు, ప్రభుత్వ విధానాల మార్పుల మధ్య సంబంధం ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.

​తోసిపుచ్చిన ఇరు పక్ష‍ాలు
అయితే ఈ పెట్టుబడుల విషయంలో వస్తున్న అనేక ఆరోపణలు, అనుమానాలను ట్రంప్‌ ‌జూనియర్‌, రిలయన్స్‌ ‌సంస్థలు కొట్టిపారేశాయి. కంపెనీలో ఆయన (డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌జూనియర్‌ ) ‌మైనారిటీ పెట్టుబడిదారుడు మాత్రమేనని ట్రంప్‌ ‌జూనియర్‌ ‌ప్రతినిధి తెలిపారు. కంపెనీ కార్యకలాపాల్లో కానీ, ‌ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ ఆయనకు ఎలాంటి పాత్రా లేదని చెప్పారు. ఇటు రిలయన్స్‌ ‌కూడా స్పందించింది. ఈ పెట్టుబడి పూర్తిగా వ్యాపార పరమైన కారణాలతోనే పెట్టామని వివరించింది. అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనమూ పొందలేదని చెప్పంది. అమెరికా ఫస్ట్‌ ‌రిఫైనింగ్‌ ‌సీఈఓ జాన్‌ ‌కాల్స్‌ ‌గతంలో పలు కోర్టు కేసులు, దివాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. సంస్థ ప్రకటించిన కొన్ని ఆయిల్‌ ‌నిల్వ కేంద్రాలు, ఉద్యోగులు, ఉన్నతాధికారుల గురించి కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. టెక్సాస్‌ ‌రాష్ట్ర పర్యావరణ అనుమతులు కూడా చాలా వేగంగా మంజూరైనట్టు ఈ-మెయిల్స్‌ ‌వెల్లడించాయి.

రాజకీయ-వ్యాపార సంబంధాల ప్రభావమా?
ట్రంప్‌ ‌కుటుంబానికి వ్యాపార ప్రయోజనం కలిగే సంస్థలో అంబానీకి చెందిన రిలయన్స్‌ ‌పెట్టుబడులు పెట్టడం, ఆ తర్వాత రిలయన్స్‌‌కు అనుకూలంగా కనిపించిన అమెరికా విధాన మార్పులు యాదృచ్ఛికమా? లేక రాజకీయ-వ్యాపార సంబంధాల ప్రభావమా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్‌ ‌కుటుంబం, రిలయన్స్‌ ‌రెండూ కూడా ఎలాంటి అక్రమాలు, అనైతిక చర్యలూ జరగలేదని చెప్తున్నప్పటికీ.. వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయని అంటున్నారు.

రాజకీయ-వ్యాపార సంబంధాల ప్రభావమా?
ట్రంప్‌ ‌కుటుంబానికి వ్యాపార ప్రయోజనం కలిగే సంస్థలో అంబానీకి చెందిన రిలయన్స్‌ ‌పెట్టుబడులు పెట్టడం, ఆ తర్వాత రిలయన్స్‌‌కు అనుకూలంగా కనిపించిన అమెరికా విధాన మార్పులు యాదృచ్ఛికమా? లేక రాజకీయ-వ్యాపార సంబంధాల ప్రభావమా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్‌ ‌కుటుంబం, రిలయన్స్‌ ‌రెండూ కూడా ఎలాంటి అక్రమాలు, అనైతిక చర్యలూ జరగలేదని చెప్తున్నప్పటికీ.. వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -