Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇందిరమ్మ ఇండ్లపై ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయండి

ఇందిరమ్మ ఇండ్లపై ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయండి

- Advertisement -

– మంత్రి పొంగులేటికి స్పీకర్‌ సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, లబ్దిదారుల ఎంపిక సంబంధిత అంశాలపై రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా స్పీకర్‌ జోక్యం చేసుకుని పలు సూచనలు చేశారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిగణంలోకి తీసుకుని తాను చేసిన వినతిని పట్టించుకోలేదని మంత్రికి చురకలు అంటించారు. ఇప్పటికైనా శాసన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. శాసన సభ సమావేశాలు ముగిసిన తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని పొంగులేటి ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -