- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
ఇంటలిజెన్స్ విభాగంలో ఏ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మహేష్ బాబు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసేవారని ప్రతిరోజు క్రీడల పట్ల ఆసక్తి చూపేవారు. అందరితో ఆప్యాయత పలకరించే వ్యక్తి మహేష్ గుండెపోటుతో మరణించడం పలువురిని కంటనీరు పెట్టించింది. పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు శ్రేయోభిలాషులు మహేష్ మృతదేహానికి నివాళులర్పించారు. అమ్రాబాద్ మండలం దోమలపెంట సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
- Advertisement -



