Magazines

తెలుగు జట్ల తాడోపేడో

1 గంట క్రితం

Telugu teams
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

ఆంధ్ర, హైదరాబాద్ 
రంజీ పోరు నేటి నుంచి

విజయనగరం: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్- బి లో రెండో రౌండ్ మ్యాచ్ లో విజయనగరం వేదికగా నేటి నుంచి హైదరాబాద్, ఆంధ్ర జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో త్రిపురపై హైదరాబాద్ మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ విజయం సాధించింది. బోనస్ పాయింట్ సైతం ఖాతాలో వేసుకుంది. మరోవైపు కర్ణాటకతో మ్యాచ్ లో గెలుపు దిశగా సాగినా, ఆఖరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సరిపెట్టుకుంది ఆంధ్ర. తెలంగాణ నుంచి కెప్టెన్ మొహమ్మద్ సిరాజ్ , ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, నయా స్పిన్ అల్ రౌండర్ రుతిక్ యాదవ్ సహా తనయ్ త్యాగరాజన్, అభిరథ్ రెడ్డి కీలకం కానున్నారు. న్యూజీలాండ్ పర్యటన ముందు సిరాజ్ ఆడనున్న ఆఖరు రంజీ మ్యాచ్ ఇదే కావడంతో అతడి ప్రదర్శనపై అంచనాలు భారీగా పెరిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్