ముగిసిన రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్షిప్ పోటీలు
నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో ఛాంపియన్ గా ఆదిలాబాద్ జట్టు నిలిచింది. శనివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డిపై ఆదిలాబాద్ 29-16 తో విజయం సాధించింది. బాలిక విభాగం ఫైనల్లో మహబూబ్ నగర్ పై ఆదిలాబాద్ 25-21 తో గెలుపొందింది. విజేతలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ప్రధాన్ కార్యదర్శి కృష్ణమూర్తి గౌడ్ బహుమతులు ప్రదానం చేశారు.







కామెంట్లు (0)