హైదరాబాద్ : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 టోర్నీ నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండులో జరిగిన మ్యాచ్ లో రంగారెడ్డిపై జనగాం జిల్లా జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత జనగాం జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన రంగారెడ్డి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో జనగాం జట్టు పరుగు తేడాతో గెలుపొందింది. ఈ సాగర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరో మ్యాచ్ లో మహబూబ్ నగర్ పై వికారాబాద్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నారాయణపేట పై అచ్చంపేట 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఉత్సాహంగా టీసీఏ క్రికెట్ మ్యాచులు
2 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)