Magazines

హైదరాబాద్‌ గెలుపు...

19 నిమిషాల క్రితం

Hyderabad
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ

కోల్‌కతా (పశ్చిమ బెంగాల్‌) : సయ్యద్‌ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఓటమిపాలైన హైదరాబాద్‌.. రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. సోమవారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్‌ తేడాతో హైదరాబాద్‌ గెలుపొందింది. 169 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ ఆఖరు బంతికి ఛేదించింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (19), ఆమన్‌ రావు (11) నిరాశపరిచినా.. అభిరథ్‌ రెడ్డి (34, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కొడిమెల హిమతేజ (37, 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌ను గెలుపు దిశగా నడిపించారు. ఈ ఇద్దరు అవుటైనా.. రాహుల్‌ బుద్ది (28, 26 బంతుల్లో 2 ఫోర్లు), ప్రణవ్‌ వర్మ (10) మెప్పించారు. ఆఖర్లో తనయ్‌ త్యాగరాజన్‌ (19, 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ మెరుపులతో హైదరాబాద్‌ను ముందుకు నడిపించాడు. అజయ్‌ దేవ్‌ గౌడ్‌ (2 నాటౌట్‌), రక్షణ్‌ రెడ్డి (1 నాటౌట్‌) ఆఖరు బంతికి సింగిల్‌ తీసి హైదరాబాద్‌ను గెలుపు తీరాలకు చేర్చారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన చత్తీస్‌గఢ్‌ 19.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్‌ అజయ్‌ దేవ్‌ గౌడ్‌ (4/28), కెప్టెన్‌ సీవీ మిలింద్‌ (3/20), రక్షణ్‌ రెడ్డి (2/34) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. దేవ్‌ ఆదిత్య సింగ్‌ (47, 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్‌ పాండే (37, 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) చత్తీస్‌గఢ్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. ఎలైట్‌ గ్రూప్‌-డిలో తర్వాతి మ్యాచ్‌లో విదర్భతో హైదరాబాద్‌ ఢీకొట్టనుంది. విదర్భ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒడిశా, గోవాలపై విజయాలు సాధించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్