Magazines

‌షూటింగ్‌‌లో కేఎల్‌హెచ్‌ విద్యార్థికి అర్జున అవార్డు

13 నిమిషాల క్రితం

KLH student receives
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా అందుకున్న పురస్కారం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

పట్టుదలకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ కేఎల్‌హెచ్‌ – అజీజ్‌నగర్‌ క్యాంపస్‌ విద్యార్థి ధనుష్‌ శ్రీకాంత్‌ జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. బధిరుల షూటింగ్‌ విభాగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు ప్రకటించింది. ఈనెల 13న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ధనుష్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో కేఎల్‌ యూనివర్సిటీ ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరోసారి ఆయన చాటిచెప్పారు. ధనుష్‌ శ్రీకాంత్‌ కేఎల్‌హెచ్‌ – అజీజ్‌నగర్‌ క్యాంపస్‌లో బీసీఏ కోర్సును అభ్యసిస్తున్నారు. విద్యాభ్యాసంతోపాటు క్రీడారంగంలోనూ ఆయన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. బధిరుల షూటింగ్‌ విభాగంలో ఆయన కనబరిచిన అసాధారణ ప్రతిభ, సాధించిన విజయాలను గుర్తించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అర్జున అవార్డుతో సత్కరించింది. షూటింగ్‌ క్రీడలో లక్ష్యంపై గురి, ఏకాగ్రత, సమయస్ఫూర్తి, మానసిక స్థైర్యం అత్యంత కీలకమని కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జి పార్థసారథి వర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరంతర సాధనతోనే ఈ క్రీడలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాంటి క్రీడలో ప్రత్యేక పరిస్థితులను అధిగమించి జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపును అందుకోవడం ధనుష్‌ శ్రీకాంత్‌ ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్