Monday, June 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బొక్కలగుట్టలో దారుణం.. వ్యక్తి హత్య

బొక్కలగుట్టలో దారుణం.. వ్యక్తి హత్య

- Advertisement -

నవతెలంగాణ-రామకృష్ణాపూర్
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట ప్రాంతంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. గజ్జి వెంకటేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతానికి చెందిన ఒడ్డేపల్లి రాజ్‌కుమార్ గడ్డకట్టిన సిమెంట్ బస్తాను వెంకటేష్‌పై వేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిసింది.

మృతుడు వెంకటేష్, నిందితుడు రాజ్‌కుమార్ మధ్య గత ఐదేళ్లుగా కుటుంబ పరమైన విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -