Thursday, January 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా అధ్యక్షుడు పుతిన్‌ నివాసంపై దాడి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నివాసంపై దాడి

- Advertisement -

91 దీర్ఘశ్రేణి డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్‌
వీడియో విడుదల చేసిన రష్యా విదేశాంగ శాఖ
ప్రపంచదేశాల ఆగ్రహం
దుశ్చర్యకు పాల్పడలేదన్న ఉక్రెయిన్‌


మాస్కో: ఉక్రెయిన్‌తో జరుగుతున్న ఘర్షణలను ముగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నివాసంపై దాడి జరిగింది. ఉక్రెయిన్‌ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను ప్రయోగించిందని రష్యా విదేశాంగశాఖ వెల్లడించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే బుధవారం రష్యా రక్షణశాఖ ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియో ప్రారంభంలోనే ఒక డ్రోన్‌ కూలిపోయిన దృశ్యం కనిపిస్తోంది. నోవ్‌గొరొడ్‌ ప్రాంతంలో పుతిన్‌ నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున డ్రోన్లతో ఉక్రెయిన్‌ దాడికి యత్నించిందని రష్యా వెల్లడించింది.

ఉక్రెయిన్‌ ప్రయోగించిన ఈ డ్రోన్లను నిర్వీర్యం చేశామని, నివాసానికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. ఈ దాడిని ఉగ్రదాడిగా పేర్కొంది. ఉక్రెయిన్‌పై సరైన సమయంలో దాడిచేసే హక్కు తమకు ఉందని, ఇది శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి అని విదేశాంగశాఖ మంత్రి లావ్రోవ్‌ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్‌ ఖండించింది. ఇదంతా అవాస్తవమని పేర్కొనింది. కాగా.. రష్యా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే నివేదికలు తీవ్ర ఆందోళన కలిగించాయని ప్రపంచదేశాల నేతలు పేర్కొన్నారు. ఘర్షణలకు ముగింపు, శాంతి సాధనకు ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నం అత్యంత ఆచరణీయ మార్గమని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -