- Advertisement -
– మండల తాసిల్దార్ కు కాలే వెంకట్ వినతి
నవతెలంగాణ మద్నూర్ : మద్నూర్ మండలంలోని సోనాల గ్రామ శివారు పరిధిలోని వ్యవసాయ భూమి సర్వే నెంబర్లు57/ఆ/2, 59/ఇ ఏ/ వీటిని సాదా బైనామా చేసి ఉందని ఈ సర్వే నంబర్ల భూమి అమ్మకాలను రిజిస్ట్రేషన్ చేయకూడదని సోనాల గ్రామానికి చెందిన కాలే వెంకట్ గురువారం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సర్వే నెంబర్ల భూమి సాదా బైనామ చేసి డబ్బులు కూడా తీసుకోవడం జరిగిందని అలాంటి వ్యక్తులు ఇతరులకు అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సర్వే నెంబర్ల భూమి రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆపాలని తాసిల్దార్ కు అందజేసిన వినతిపత్రంలో ఆయన విజ్ఞప్తి చేశారు
- Advertisement -



