- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలో పౌర హక్కుల గురించి అవగాహన సదస్సు నిర్వహించినట్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. ప్రతి ఒక్కరూ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో లింబూర్ గ్రామ సర్పంచ్ సుజాత శివారెడ్డి, ఆ గ్రామ ఉపసర్పంచ్ అలాగే పోలీస్ శాఖ, హాస్టల్ వార్డెన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



