Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భానుడి వేడి.. గ్రామస్థులకు సర్పంచ్ కీలక సూచనలు

భానుడి వేడి.. గ్రామస్థులకు సర్పంచ్ కీలక సూచనలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
భానుడి వేడికి ప్రజలు అల్లాడుతున్నారు. రోడ్లపైకి రావాలంటే జడుసుకుంటున్నారు. స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులు ఎండ వేడికి చమటలు కక్కుతూ ఇండ్లకు చేరుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు వడదెబ్బకు గురవుతున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మండల పరిధిలోని హెచ్ కేలూరు గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ కార్యదర్శి విజయ్ కుమార్ తో కలిసి ప్రజల ముఖ్య సూచనలు చేశారు. ఊర్లోని ప్రతి వాడలో తిరుగుతూ మైక్ ద్వారా వారు మాట్లాడుతూ.. ప్రజలందరూ అప్పమత్తంగా ఉండాలని తెలిపారు. పొద్దంతా ఎండతో వేడెక్కిన ఇండ్లల్లో ఉక్కపోత భరిచక ఆరు బయట నిద్రించేవారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఆద మరిచి ఉంటే దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

చెరువుల్లో ఊతకు వెళ్ళే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విహార యాత్రలకు వెళ్ళేవారు ఇండ్లకు తాళాలు వేశాక, జీపీ కార్యదర్శికి, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామంలో గుర్తు తెలియని అపరిచితులు ఎవరైనా తిరిగితే వెంటనే సర్పంచ్ కు, డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -