Sunday, May 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలండన్‌ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి

లండన్‌ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ యువతి లండన్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కొనకాటి పూజిత.. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 7న వెలువడగా, పూజిత విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఆరున్నరేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం పూజిత లండన్ వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డారు. గతేడాది ఫిబ్రవరిలో లండన్‌లోనే పనిచేస్తున్న ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన కడదూరి శ్రీనివాస్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -