- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్‌లో తమ నౌకలపై దాడులు జరిగితే అమెరికా సైనిక స్థావరాలు, నౌకలు లక్ష్యాలుగా మారతాయని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. తమ క్షిపణులు ఇప్పటికే అమెరికా ఆస్తులను “లాక్” చేయాని తెలిపింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Advertisement -



