Sunday, June 14, 2026
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో ‘కానిస్టేబుల్’రాత‌పరీక్ష..స‌రిప‌డ రైలు లేక అభ్య‌ర్థులు తీవ్ర అవ‌స్థ‌లు

బీహార్‌లో ‘కానిస్టేబుల్’రాత‌పరీక్ష..స‌రిప‌డ రైలు లేక అభ్య‌ర్థులు తీవ్ర అవ‌స్థ‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ నియమాక‌ రాత‌పరీక్ష(Bihar Police Prohibition Department examination) నేప‌థ్యంలో అభ్య‌ర్థులు రైల్వే స్టేష‌న్ల‌కు పొటెత్తారు. ఆదివారం పాట్నా రైల్వే జంక్ష‌న్‌తో పాటు రాష్ట్రంలోని అనేక రైల్వే స్టేష‌న్లు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌తో కిక్కిరిసిపోయ్యాయి. ప‌రీక్ష కేంద్రాల‌కు స‌కాలంలో చేరుకునేందుకు సుదూర ప్రాంతాల‌నుంచి ఒక్క రోజు ముందుగానే రైల్వే స్టేష‌న్‌ల‌కు చేరుకున్నారు. అయితే ఎన్డేయే ప్ర‌భుత్వ పాల‌న నిర్ల‌క్ష్యంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు అభ్య‌ర్థులు. ర‌ద్దీకి త‌గ్గ‌ట్లుగా స‌రిప‌డ రైలు లేక‌పోవ‌డంతో బోగీల‌న్ని కిక్కిరిసిపోయ్యాయి. బోగీల మెట్ల వ‌ద్ద‌, డోర్లు ప‌ట్టుకొని వేలాడుతూ ప్ర‌మాద‌క‌ర స్థితిలో త‌ప్ప‌నీస‌రి ప‌రిస్థితుల్లో అభ్య‌ర్థులు ప్ర‌యాణిసాగిస్తున్నారు. మ‌రికొన్ని ట్రైన్లు స‌కాలంలో రాక‌పోవ‌డంతో ప‌లువురు అభ్య‌ర్ధులు ప‌రీక్ష రాయ‌లేక‌పోయమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితుల నేప‌థ్య‌లో ప‌లువురు అభ్య‌ర్థులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మాట్లాడుతూ రైళ్లు తక్కువగా ఉండటం వల్ల గందరగోళం నెలకొందని . “14 లక్షల మంది విద్యార్థులు ఉంటే, పాటలీపుత్ర నుంచి కేవలం రెండు రైళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు రైల్లో ఎంతమంది విద్యార్థులు ప్రయాణించగలరు? నేను నా మొదటి షిఫ్ట్ పరీక్షను కోల్పోయాను. ఇప్పుడు పాటలీపుత్ర నుంచి తిరిగి వస్తున్నాన‌ని ర‌వి కుమార్ అనే అభ్య‌ర్థి వాపోయాడు.

రవీంద్ర కుమార్ అనే మరో విద్యార్థి, విపరీతమైన రద్దీ కారణంగా తాను పరీక్షకు హాజరుకాలేకపోయానని. “నేను పరీక్షకు హాజరుకాలేకపోయాను. నా పరీక్షా కేంద్రం సమస్తిపూర్‌లో ఉంది, నేను పాటలీపుత్రం నుండి ప్రయాణించాను. ఉదయం 9:35 గంటలకు బయలుదేరాల్సిన రైలు అప్పటికి ఇంకా కదలలేదు” అని రవీంద్ర కుమార్ అనే మరో అభ్య‌ర్థి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

‘2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’గా మారుతుందని ప్రధాని మోదీ అంటున్నారు. ఒకసారి దీన్ని చూడండి, భారత్ ‘వికసిత్ భారత్’గా ఎలా మారుతుంది? ప్రయాణికుల రైళ్లలో ప్రజలు కూర్చోవడానికి కనీసం చోటు కూడా లేనంత రద్దీ ఉంటోంది. ఎలాంటి రైళ్లను నడుపుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. పరీక్షల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రధాని మోడీకి’ కుమార్ అనే అభ్య‌ర్థి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -