Magazines

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్2026:తెలంగాణలో షాపింగ్ వెల్లువ!

2 గంటల క్రితం

Amazon Great Indian Festival
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ హైదరాబాద్:అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026సేల్‌లో తెలంగాణ కస్టమర్లు,అమ్మకందారులు భారీ సంఖ్యలో పాల్గొని సరికొత్త రికార్డులు సృష్టించారు.పండగ సీజన్‌లో కస్టమర్లు ప్రీమియం ఉత్పత్తులతో పాటు సరసమైన కొనుగోళ్లకు ప్రాధాన్యతనిచ్చారు.ముఖ్యంగా హైదరాబాద్‌లో రిఫ్రిజిరేటర్లు,వాషింగ్ మెషీన్లు,ఏసీలు వంటి పెద్ద ఉపకరణాల అమ్మకాలు సాధారణ రోజుల కంటే 10రెట్లు పెరిగాయి.అలాగే అనలాగ్ వాచీలకు 4రెట్లు,మెన్స్ జీన్స్,రన్నింగ్ షూలకు 3రెట్ల డిమాండ్ ఏర్పడగా,బడ్జెట్ షాపింగ్‌ను అందించే అమేజాన్ బజార్ సైతం 3రెట్లు వృద్ధి సాధించింది.

నిత్యావసర విభాగంలో బియ్యం,డ్రై ఫ్రూట్స్,ఎండు కూరగాయలు,పప్పులు,లాండ్రీ లిక్విడ్,బేబీ,పెట్ కేర్ ఉత్పత్తుల కొనుగోళ్లు రెట్టింపయ్యాయి.హోమ్,కిచెన్ విభాగంలో వాకింగ్ ప్యాడ్స్,ఎలక్ట్రిక్ స్కూటర్లకు లభించిన ఆదరణతో 3రెట్ల వృద్ధి నమోదైంది.మరోవైపు అమేజాన్ బిజినెస్ ద్వారా ఐటీ డివైజన్లు,టీవీలు,ఆఫీస్ ఉత్పత్తుల కొనుగోళ్లు 5రెట్లు పెరిగాయి.ఈ పండగ సేల్‌లో తెలంగాణ నుండి 63,000మందికి పైగా విక్రేతలు పాల్గొనడం విశేషం.అంతేకాకుండా,సరైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి రూఫస్ (Rufus) AIఅసిస్టెంట్,అమేజాన్ లెన్స్, AIరివ్యూలను కస్టమర్లు విశేషంగా ఉపయోగించుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్