Magazines

చేతులు శుభ్రంగా ఉంచుకుంటే ప్రాణాంతక యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ముప్పును తగ్గించవచ్చు

5 గంటల క్రితం

Savlon Swasth India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఒకప్పుడు నయం చేసిన మందు ఇప్పుడు జబ్బును తగ్గించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణ జలుబు లేదా చిన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గడం కష్టమైపోతుంది. కాలక్రమేణా డాక్టర్లు ఇచ్చే మందుల సంఖ్య తగ్గిపోయి, ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ సమస్యనే 'యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్' (ఏఎంఆర్) అంటారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద ప్రమాదాలలో ఇది కూడా ఒకటి.


యాంటీబయాటిక్స్ మన వైద్య రంగాన్నే పూర్తిగా మార్చేశాయి. ఎన్నో ప్రాణాంతక రోగాలను నయం చేసి లక్షలాది ప్రాణాలను కాపాడాయి. కానీ వీటిని అవసరం లేకపోయినా, అతిగా వాడటం వల్ల పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. బ్యాక్టీరియా పదేపదే ఈ మందులకు గురైనప్పుడు, వాటిని తట్టుకుని బతికే శక్తిని సంతరించుకుంటుంది. అప్పుడు ఆ మందులు ఆ రోగంపై పనిచేయవు.


ఈ సమస్యను ఎదుర్కోవాలంటే మనం రెండు పనులు చేయాలి: ఒకటి.. యాంటీబయాటిక్స్‌ను ఎప్పుడు పడితే అప్పుడు వాడకుండా జాగ్రత్తపడాలి. రెండు.. చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. సబ్బుతో తరచుగా చేతులు కడుక్కునే ఈ చిన్న అలవాటు క్రిములు మన శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఏఎంఆర్ వంటి పెద్ద ముప్పును చాలా వరకు తగ్గించవచ్చని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి.


ప్రపంచ ఏఎంఆర్ అవగాహన వారం (నవంబరు 18–24) సందర్భంగా.. ఐటీసీకి చెందిన ‘సావ్లాన్ స్వస్థ్ ఇండియా మిషన్’ (ఎస్ఎస్ఐఎం) ప్రజలకు ఈ విషయాన్ని సులభంగా అర్థం చెప్పేందుకు '#వీలవ్‌యాంటీబయాటిక్స్' పేరుతో ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. యాంటీబయాటిక్స్‌ను మనం ఎలా వాడుతున్నాం అనే దానిపై పునరాలోచించుకోవాలని, చేతుల శుభ్రత ఎంత ముఖ్యమో తెలుసుకోవాలని ఈ ప్రచారం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ ప్రచార వీడియోను ఇక్కడ చూడవచ్చు.


ఈ కార్యక్రమం గురించి ఐటీసీ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ హెడ్ సమీర్ సత్పతి మాట్లాడుతూ.. "చేతుల పరిశుభ్రతపై ప్రజల్లో మార్పు తెచ్చేందుకు సావ్లాన్ మిషన్ ఎప్పట్నుంచో కృషి చేస్తోంది. యాంటీబయాటిక్స్ సరిగ్గా పనిచేయకపోవడం అనేది ఇప్పుడు అందరూ ఆందోళన చెందాల్సిన విషయం. ఇళ్లలోనూ, హాస్పిటల్స్‌లోనూ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. యాంటీబయాటిక్స్‌ను బాధ్యతగా వాడాలని, ఇన్ఫెక్షన్లు రాకుండా చేతులు కడుక్కోవాలని చెప్పేందుకే మేము ఈ ప్రచారాన్ని తెచ్చాం" అని తెలిపారు.


అలాగే, ఫే డిసౌజాతో కలిసి సావ్లాన్ రూపొందించిన ‘డాక్స్ పాడ్’ సిరీస్‌లో నిపుణులు ఈ ఏఎంఆర్ సమస్య గురించి చాలా స్పష్టంగా వివరించారు. ఆ పాడ్‌కాస్ట్ ఇక్కడ చూడవచ్చు.


అపోలో హాస్పిటల్స్ డాక్టర్ విజయ్ యేవాలే మాట్లాడుతూ.. "మనకు లేదా పిల్లలకు కొద్దిగా జ్వరం, దగ్గు రాగానే వెంటనే యాంటీబయాటిక్స్ వాడేయడం మనం చేసే పెద్ద తప్పు. ఇంట్లో మిగిలిపోయిన పాత మందులు వేసుకోవడం, డాక్టర్ చెప్పిన రోజులు పూర్తి కాకుండానే మధ్యలో ఆపేయడం చేస్తుంటాం. సాధారణ వైరల్ జలుబుకు యాంటీబయాటిక్స్ అసలు పనిచేయవు. మందులు ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలి. అంతకంటే ముఖ్యం.. తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం ఉత్తమం. జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కంటే, అసలు రాకుండా జాగ్రత్త పడటమే మంచిది" అని వివరించారు.


ఈ అవగాహన వారంలో, ప్రతి ఒక్కరూ రోజువారీ పరిశుభ్రతను అలవాటు చేసుకుని ఇన్ఫెక్షన్లను అడ్డుకోవాలని సావ్లాన్ కోరుతోంది. ఎందుకంటే ఈ పోరాటం కేవలం డాక్టర్లకు, హాస్పిటల్స్‌కు మాత్రమే సంబంధించినది కాదు.. మనం రోజూ చేసే చిన్న చిన్న మంచి అలవాట్లతోనే ఇది మొదలవుతుంది.


ఏఎంఆర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.


సావ్లాన్ స్వస్థ్ ఇండియా మిషన్ గురించి: 

2016లో ప్రారంభమైన ‘సావ్లాన్ స్వస్థ్ ఇండియా మిషన్’.. ముఖ్యంగా పిల్లల్లో చేతులు కడుక్కునే మంచి అలవాటును పెంచడానికి కృషి చేస్తోంది. ఇప్పటివరకు 68 వేలకు పైగా పాఠశాలలకు, 1.59 కోట్ల మంది పిల్లలకు ఈ అవగాహనను చేరవేశారు. ఇన్ఫెక్షన్లు లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే ఈ మిషన్ లక్ష్యం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్