Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమాలధారణలో ఉన్న విద్యార్థిని కొట్టారంటూ బీజేపీ నాయకుల రచ్చ

మాలధారణలో ఉన్న విద్యార్థిని కొట్టారంటూ బీజేపీ నాయకుల రచ్చ

- Advertisement -

– ఉద్దేశపూర్వకంగా చేయలేదన్న ఉపాధ్యాయులు
– తమ కొడుకును కొడితే బయటివాళ్లకు ఏం సంబంధమన్న తల్లిదండ్రులు
– ఉపాధ్యాయులకు క్షమాపణ
నవతెలంగాణ – రుద్రంగి

మాలధారణలో ఉన్న విద్యార్థిని ఉపాధ్యాయులు కొట్టారంటూ కొందరు బీజేపీ నాయకులు హనుమాన్‌ మాల వేసుకున్న వారితో కలిసి వచ్చి పాఠశాలలో రచ్చ చేసిన సంఘటన సిరిసిల్ల రాజన్న జిల్లా రుద్రంగి గ్రామంలో జరిగింది. పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. తాము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదంటూ ఉపాధ్యాయులు క్షమాపణ చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. మాలధారణలో ఉన్న విద్యార్థులను లుంగీతో రావొద్దని, ప్యాంట్‌ వేసుకుని రావాలని మాత్రమే సూచించామని తెలిపారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఓ బాధిత విద్యార్థి తల్లిదండ్రులు స్పందిం చారు. తమ కొడుకును కొడితే బయటివాళ్లకు ఏం సంబంధం అంటూ ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. తమ కొడుక్కు చదువు రాకపోతే ఎవరిది బాధ్యత అని అడిగారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయొద్దని సూచిస్తూ.. తమ కొడుకు వల్ల జరిగిన తప్పునకు ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనపై చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -