Wednesday, February 18, 2026
E-PAPER
Homeజిల్లాలుజిల్లా కేంద్రంలో “సంచార జాతులు – సమగ్ర సర్వే” పుస్తకావిష్కరణ

జిల్లా కేంద్రంలో “సంచార జాతులు – సమగ్ర సర్వే” పుస్తకావిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో “సంచార జాతులు –  సమగ్ర సర్వే” పుస్తకావిష్కరణ కార్యక్రమం  నిర్వహించారు. ఈ పుస్తకాన్ని కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత సామాజిక సమరసతా కళావిభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ, మొఘల్, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంచార జాతుల వారు సైనికులుగా, గూఢాచారులుగా చేసిన పోరాటం అమోఘమని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో సంచార జాతుల కళారీతులు అద్వితీయమని పేర్కొన్నారు.

1871లో బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ప్రభావంతో సంచార జాతుల పతనం ప్రారంభమై, నేడు వారి జీవన స్థితిగతులు అత్యంత దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంచార జాతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో యాభై మంది సామాజిక కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 33 సంచార జాతులకు చెందిన 1450 కుటుంబాల్లో సుమారు 7000 మందిని ప్రత్యక్షంగా కలిసి వారి జీవన స్థితిగతుల వివరాలు సేకరించారు. ఆ నివేదిక ఆధారంగా ఈ పుస్తకాన్ని తెలుగులో ముద్రించారు. కామారెడ్డి జిల్లాలో సామాజిక సమరసత వేదిక జిల్లా కమిటీ సభ్యులు 162 కుటుంబాలను కలిసి సమగ్ర సర్వే నిర్వహించారు.

ఈ పుస్తకం ద్వారా ప్రభుత్వం సంచార జాతుల జీవనాధారమైన కళలను ప్రోత్సహించాలని, వారి ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. సంచార జాతుల పిల్లలకు విద్య అందేలా ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. కుల సర్టిఫికెట్లు సులభంగా పొందేలా ప్రక్రియను సరళీకరించాలని, స్వయం అభివృద్ధికి ఉపాధి పథకాలు రూపొందించాలని, భూమిలేని వారికి భూములు కేటాయించి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.బిఈ పుస్తకం ఆన్లైన్లో అమెజాన్‌లో అందుబాటులో ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహా సంయోజక్ సంగన్నగారి బాల్‌రాజ్ గౌడ్, జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్, జిల్లా అధ్యక్షులు అమృత రాజేందర్, మహిళా కన్వీనర్ సోలంకి రవళి, సహా కన్వీనర్ సుష్మ, నగర సంయోజక్ దత్తు రావు, ప్రధాన కార్యదర్శి మన్నె కృష్ణ, కృష్ణమూర్తి, సంగి రాజేందర్, రఘు కుమార్, సామల గంగారెడ్డి, నారాయణ గౌడ్, ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -