Thursday, June 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్రీన్‌కార్డు హోల్డర్లపై బోర్డర్ ఏజెంట్లకు విస్తృత అధికారాలు

గ్రీన్‌కార్డు హోల్డర్లపై బోర్డర్ ఏజెంట్లకు విస్తృత అధికారాలు

- Advertisement -

వాషింగ్టన్ : నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్‌కార్డు హోల్డర్ల (చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు)ను దేశం నుంచి బహిష్కరించేందుకు ఫెడరల్ బోర్డర్ ఏజెంట్లకు ఉన్న అధికారాన్ని అమెరికా సుప్రీంకోర్టు పెంచింది. బెంచ్‌లోని న్యాయమూర్తులలో ఆరుగురు అధికారాల పెంపును సమర్ధించగా ముగ్గురు వ్యతిరేకించారు. ఈ తీర్పు ప్రకారం…దేశంలో ప్రవేశించాలని కోరుకునే వలసదారుడికి అనుమతి నిరాకరించడానికి ముందు అతను నేరం చేశాడని స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యాలతో నిరూపించాల్సిన అవసరం ఇకపై సరిహద్దు ఏజెంట్లకు ఉండదు. వారు నేరం చేశారని విశ్వసించడానికి కారణం ఉన్నదని చూపితే సరిపోతుంది. ఈ తీర్పు కారణంగా అమెరికా సరిహద్దుల వద్దకు వలసదారులు రాగానే వారి చట్టబద్ధమైన శాశ్వత నివాస (ఎల్‌పీఆర్) హోదాను రద్దు చేయడం సరిహద్దు అధికారులకు సులభం అవుతుంది. అమెరికా గ్రీన్‌కార్డు కలిగిన చైనా జాతీయుడు ముక్ చోయ్ లా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యూజెర్సీ రాష్ట్రంలో నకిలీ ట్రేడ్‌మార్క్‌కు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ముక్ చోయ్ 2012లో చైనా నుంచి అమెరికాకు తిరిగి వచ్చారు. అయితే న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి తొలుత ఆయనను అనుమతించలేదు. ఆ తర్వాత కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని ముక్ చోక్ అంగీకరించడంతో ఆయనను దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అమెరికా వలస చట్టం ప్రకారం కొద్దికాలం కోసం విదేశాలకు వెళ్లిన గ్రీన్‌కార్డు హోల్డర్లు తిరిగి దేశంలో అడుగు పెట్టవచ్చు. అయితే వారు నైతికంగా పతనమైనట్లు రుజువైనా లేక వారే దానిని అంగీకరించినా దేశంలోకి కొన్ని షరతులకు లోబడి అనుమతిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -