Magazines

జమ్మూ కాశ్మీర్‌లో 4 భూకంపాలు..

5 గంటల క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : జమ్మూకశ్మీర్‌లో వరుస భూకంపాలు కలకలం రేపాయి. శనివారం మధ్యాహ్నం వరకు 12 గంటల వ్యవధిలో నాలుగుసార్లు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. దోడా-కిష్త్వార్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని 2.7 నుంచి 3.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. హిమాలయ ప్రాంతం భూకంప ముప్పు ఎక్కువగా ఉండే జోన్‌-4, 5 పరిధిలో ఉండటంతో తరచూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్