Magazines

రసగుల్లా అంటూ నాటుబాంబు ఇచ్చిన బంధువు... పేలి వ్యక్తి మృతి

1 గంట క్రితం

A relative gave him a bomb, saying it was rasagulla... The man died after it exploded.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని డిండౌరీ జిల్లా పడరియా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజేంద్ర బరోటియా (35) అనే వ్యక్తి నాటుబాంబును స్వీటుగా భావించి నోట్లో పెట్టుకోవడంతో పేలి మృతిచెందాడు. మంగళవారం రాత్రి అతని ఇంటికి వచ్చిన బంధువు రామ్‌భగత్‌ బరోటియా.. రసగుల్లా అంటూ ఓ వస్తువును రాజేంద్రకు ఇచ్చాడు. చీకట్లో అది ఏమిటో గుర్తించలేక రాజేంద్ర నోట్లో పెట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు శబ్దం విని కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జంతువులను చంపేందుకు ఉపయోగించే నాటుబాంబుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు రామ్‌భగత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్