నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యల్పంగా నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌లో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో సీజనల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో మరో రెండు రోజులు తీవ్ర చలి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)